- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : జగిత్యాలలో ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో హాస్టల్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక దరూర్ క్యాంపులో గల ఎస్సీ వసతి గృహంలో ఎనిమిదో తరగతి విద్యార్థి హిమేశ్ చంద్ర గురువారం హాస్టల్ భవనంపై ఆరేసిన దుస్తులు తీసుకురావడానికి వెళ్లాడు.
భవనం పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ పేలి నిప్పురవ్వలు విద్యార్థిపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. హాస్టల్ సిబ్బంది హిమేశ్ చంద్రను వెంటనే జగిత్యాల ఏరియా దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని దవాఖానలో చేర్పించారు. ఈ ఘటనతో హాస్టల్ విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.
- Advertisement -



