- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రవేశాలకు నిర్వహించిన టీజీ ఆర్ జె సి సెట్ ఫలితాలలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ హై స్కూల్ కు చెందిన విద్యార్థిని తోటకూర వైష్ణవి రాష్ట్రస్థాయి మూడవ ర్యాంకు సాధించింది. మే 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 35 పాఠశాలల్లో నిర్వహించిన ఈ ఎంట్రెన్స్ పరీక్షకు 61, 476 మంది హాజరయ్యారు. కాగా తోటకూర వైష్ణవి రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు, తోటకూర శ్రీవిద్య 89వ ర్యాంకు, అర్పిత్ యాదవ్ 129వ ర్యాంకు సాధించడం పట్ల ఆ పాఠశాల ప్రిన్సిపాల్ తోటకూర యాదయ్య, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -