- Advertisement -
నవతెలంగాణ -పెద్దవూర: నల్గొండ జిల్లా పెద్దవూర మండలం లోని పోతునూరు ప్రాథమీకోన్నత పాఠశాలలో గురువారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 30 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరిస్తూ వివిధ పాఠ్యాంశాలను బోధించారు. విద్యార్థులు కృత్యాధార పద్ధతి, చార్టులు, నమూనాల ద్వారా పాఠాలను బోధిస్తూ తమ ప్రతిభను ప్రదర్శించారు. ఉదయం 8 గంటలకు ప్రార్థనతో ప్రారంభమైన కార్యక్రమం మధ్యాహ్నన్నం వరకు ఉత్సాహంగా కొనసాగింది.ప్రాధానోపాధ్యాయులు సర్పంచిగా సాయి ఒక్కరోజు వారి విధులను చాలా చక్కగా నిర్వహిచారు. ఈసందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్రామ్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నాయకత్వ లక్షణాలు, బాధ్యతా భావం పెంపొందుతాయని తెలిపారు.విద్యార్థులు చక్కగా చదివి తల్లిదండ్రులకు,గురువులకు,సమాజానికి మంచి పేరు ప్రాతిష్టలు తీసుక రావాలని సూచించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా బోధిస్తూ కార్యక్రమాన్ని ఆనందంగా నిర్వహించారన్నారు.అనంతరం ఉత్తమ ప్రతిభ కనపరచిన వారికి బహుమతులు అంద జేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామమూర్తి, మెహజాబి, అంజద్, అంజుమ్, బేబీలత, ధర్మారెడ్డి, అనిత గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



