- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గుంటూరు జిల్లా అన్నపర్రులోని బీసీ హాస్టల్‌లో సుమారు 47 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులను పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐదుగురు విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై స్పందించిన ఏపీ మంత్రి సవిత, విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తాగునీరు, ఆహారం శాంపిళ్లను పరీక్షకు పంపాలని సూచించారు.
- Advertisement -