Wednesday, November 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయుల నియామకంపై విద్యార్థుల ధర్నా..

ఉపాధ్యాయుల నియామకంపై విద్యార్థుల ధర్నా..

- Advertisement -

నవతెలంగాణ – కడ్తాల్ : ముదివెన్ జడ్పీ హెచ్‌ఎస్ పాఠశాలలో భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం ఉపాధ్యాయుల లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మూడు నెలలుగా సబ్జెక్ట్ టీచర్లు లేకపోవడంతో చదువు పూర్తిగా దెబ్బతినడంతో బుధవారం విద్యార్థులు పాఠశాల ముందు ధర్నాకు దిగారు.ఇంతకుముందు ఉన్న ఉపాధ్యాయులు ప్రమోషన్‌తో బదిలీ అయినప్పటి నుంచి ఖాళీలు భర్తీ చేయకపోవడాన్ని విద్యార్థులు తప్పుపట్టారు. పలుమార్లు ఎంఈఓ, డీఈఓలకు విజ్ఞప్తులు చేసినా స్పందించకపోవడం తమ భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యం వైఖరిని సూచిస్తోందని విద్యార్థులు ఆరోపించారు. ధర్నా సందర్భంగా విద్యార్థులు బీటాయించి గట్టిగా నినాదాలు చేశారు—“మా చదువు హక్కు… ఉపాధ్యాయులు ఇవ్వాలి.
గురువుల్లేక ఎలా ఎగ్జామ్ రాస్తాం..?
– స్కూల్‌కు టీచర్లు పంపండి… మా భవిష్యత్తు కాపాడండి, ప్రభుత్వం నిద్రలేచాలి… విద్యార్థుల సమస్యలు వినాలి, ఎగ్జామ్స్‌కు మూడు నెలల సమయం మాత్రమే మిగిలి ఉండగా ఈ పరిస్థితుల్లో ఎలా చదువుకోవాలని ప్రశ్నించిన విద్యార్థులు, అధికారుల నిర్లక్ష్యం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూల్‌లపై ఎలా నమ్మకం పెట్టుకోవాలి? మా భవిష్యత్తు కోసం ఎవరైనా మాట్లాడరా?” అంటూ విద్యార్థులు బాధపడ్డారు.విద్యార్థుల సమస్యలను అత్యవసరంగా పరిష్కరించి వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -