- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్ : విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించాలని రాష్ట్రస్థాయి పరిశీలకులు ఎల్లయ్య తెలిపారు. గురువారం మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, పెద్ద మల్లారెడ్డి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పాఠశాలలను సందర్శించారు. కాంప్లెక్స్ సమావేశాలలో సాంఘిక శాస్త్రం, జీవశాస్త్రం పరిశీలించి లిప్ కార్యక్రమం, ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమాలకు సంబంధించి న ప్రశ్న పత్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి రాజ గంగారెడ్డి, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ప్రసూనాదేవి, సుజాత, రాణి, సిఆర్పిలు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



