Saturday, July 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు మంచి విద్యను అందించాలి: కలెక్టర్

ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు మంచి విద్యను అందించాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  : ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉపాధ్యాయులు మంచి విద్యనభ్యసించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం భువనగిరి మండలంలోనీ అనంతారం మైనారిటీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్  ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాలలో టీచర్స్ , లెక్చరర్స్,సిబ్బంది యొక్క  అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు. విద్యార్థులకు సాయంత్రం అందించే స్నాక్స్ ని పరిశీలించారు. హాస్టల్ కిచెన్ ను తనికి చేసి నూతన మెనూ ప్రకారం విద్యార్థులకి భోజనం పెడుతున్నారా లేదా అని హాస్టల్ వార్డెన్ ని అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందజేయాలన్నారు.

కిచెన్ లో నిల్వ ఉన్న కూరగాయలను వెంటనే తీసివేసి, కూరగాయలు ఎప్పటికపుడు తాజాగా తెచ్చి వండాలని అన్నారు. పాఠశాలలో అన్ని వసతులు ఉన్నాయా లేవా అని సంబంధిత అధికారిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని చెపుతూ  ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న సదుపాయాలను తల్లిదండ్రులకు తెలియజేస్తూ అడ్మిషన్ లు పెరిగేలా చూడాలని అన్నారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -