నవతెలంగాణ-జన్నారం : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాల యందు తెలంగాణ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ మరియు ఎస్సీఈ ఆర్టీ తెలంగాణ సహకారంతో మండల స్థాయి ఆంగ్ల భాష ప్రతిభ పరీక్షలను నిర్వహించారు. ఉపన్యాస పోటీలలో సీనియర్స్ విభాగంలో ప్రథమ బహుమతి కలమడుగు జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలకు చెందిన ఆంజనేయ ప్రసాద్, ద్వితీయ బహుమతి బాదం పెళ్లి పాఠశాలకు చెందిన అవంతిక జూనియర్ విభాగంలో ప్రథమ బహుమతి కిష్టాపూర్ పాఠశాల చెందిన అనుశ్రీ,ద్వితీయ బహుమతి తపాలాపూర్ పాఠశాలకు చెందిన శ్రీనిధి, సీనియర్ విభాగంలో ప్రథమ బహుమతి కిష్టాపూర్ పాఠశాలకు చెందిన అనన్య ద్వితీయ బహుమతి కలమడుగు పాఠశాలకు చెందిన జస్వంత్ జూనియర్స్ విభాగంలో కిష్టాపూర్ పాఠశాలకు చెందిన హర్షిని ద్వితీయ బహుమతి బాదం పెళ్లి పాఠశాలకు చెందిన సత్యప్రసాద్ లు మండల స్థాయిలో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు ఈ సందర్భంగా ఈ ఎల్ టి ఏ కన్వీనర్ ప్రకాష్ బాణావథ్ మాట్లాడుతూ చాలా ప్రాధాన్యత ఉందని, ఆంగ్లభాషపై పట్టు సాధించగలిగితె అనేక ఉపాధి అవకాశాలు ఉంటాయని, ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోవడానికి ఆంగ్ల భాష ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు లు కట్ట రాజమౌళి, అజయ్,స్వర్ణలత, సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాముఖ కమలాకర్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
విద్యార్థులు ఆంగ్లంపై పట్టు సాధించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



