నవతెలంగాణ-హైదరాబాద్: విద్యానగర్ లోని వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యాంటీ డ్రగ్స్ అబ్యూజ్ కమిటీ ఆధ్వర్యంలో ‘నషా ముక్తి భారత్ అభియాన్’ ఏర్పడి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు డా. కె.ప్రభు అధ్యక్షతన విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది.
ఈ సందర్భంగా ప్రధానాచార్యులు మాట్లాడుతూ…దేశంలో ఉన్న కొంతమంది యువకులు మాదకద్రవ్య వ్యసనంలో పడి తమ శరీరంతో పాటు కుటుంబాన్ని,దేశాన్ని కూడా నష్టపరుస్తున్నారని, మాదకద్రవ్య వినియోగం రేటు పెరుగుతుండడం వలన సమాజంపై హానికరమైన ప్రభావాన్ని చూపిస్తుందని అన్నారు..దీనిని పరిష్కరించడానికి దేశాన్ని మాదకద్రవ్య రహితంగా మార్చాలనే మంచి ఉద్దేశంతో నషా ముక్తి భారత్ అభియాన్ (NMBA ) 2020 ఆగస్టు 15న దేశంలో ప్రారంభించబడిందనీ, దేశంలో, రాష్ట్రాలలో మాదకద్రవ్యాల నివారణ కార్యక్రమాలను అమలు చేసే కమిటీలను ఏర్పాటు చేసి, పర్యవేక్షించి, మార్గదర్శకత్వం అందించడంలో నషా ముక్తి భారత్ అభియాన్ ప్రముఖ పాత్ర వహిస్తుందనీ అన్నారు.
విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ మాదక ద్రవ్యాలను సేవించవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాలలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల యాంటీ డ్రగ్స్ అబ్యూజ్ కమిటీ కన్వీనర్లు వెంకటేశ్వర్,డా. ఆర్. లావణ్య, అధ్యాపకులు డా.జగన్ మోహన్, డా. ఆర్. రమాదేవి, డా.నవీన మంజులత, డా. బండారు శ్రీనివాస్ గౌడ్, డా. మహేష్, డా.అనసూర్య, డా. పెబ్బేటి మల్లికార్జున్, డా. కె.నీరజ, డా.నిశ్చల మరియు పోలీస్ శాఖ వారు పాల్గొన్నారు.