– అభినందించిన మోడల్ స్కూల్ ప్రిన్స్ పాల్ పూర్ణచందర్ రావు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన పీఎం శ్రీ (ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా) జిల్లా స్థాయి క్రీడలలో గెలుపొందారు. వారిని పాఠశాల ప్రిన్సిపల్ సిహెచ్ పూర్ణచందర్ రావు బుధవారం అభినందించారు. జిల్లాలో నిర్వహించిన కబడ్డీ బాలికల విభాగంలో మొదటి బహుమతి, ఖోఖోలో బాలుర విభాగంలో రెండవ బహుమతులు సాధించినట్లుగా తెలిపారు. అథ్లెటిక్స్ విభాగంలో బాలికల విభాగంలో లాంగ్ జంప్ మొదటి బహుమతి ఎం ప్రవళిక, షాట్ పుట్ లో రెండో బహుమతి బారుల విభాగంలో షార్ట్పుట్లో మొదటి బహుమతి ఏ.భవాని, ప్రసాద్ సాధించారు. లాంగ్జంప్లో పి. నిశాంత్ రెండవ బహుమతి సాధించాడు. వీరితోపాటు ఫిజికల్ డైరెక్టర్ పక్కల రాజబాబు, ను కోచ్ హట్కర్ రఘువీర్ ను ప్రిన్సిపాల్ పూర్ణచంద్రరావు అభినందించారు.
జిల్లాస్థాయి క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



