నవతెలంగాణ -మంథని /ముత్తారం
మంథనిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బుధవారం ప్రెషర్ డే వేడుకలు హోరెత్తించాయి. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే ఉచిత విద్యను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో ఈ కళాశాల నుంచి శ్రీజ ప్రథమ స్థానంలో నిలవడం హర్షణీయం అన్నారు. కళాశాలలో ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని, అకాడమిక్ క్లాసులు మాత్రమే కాకుండా ఎప్ సెట్, నీట్, క్లాట్ మొదలైన పోటీ పరీక్షలకు సైతం విద్యార్థులను సిద్ధం చేస్తున్నామన్నారు. అనంతరం విద్యార్థులు చేపట్టిన సాంసృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సయ్యద్ సలీం,రిటైర్డ్ ప్రినిపాల్ అంబరీష్, అధ్యాపకులు రaాన్సీ, శ్రీధర్ రావు, తిరుపతి, తిరుమల్, శశాంక్, నగేష్, ఎల్ ఆర్ కే రెడ్డి,శ్రీదేవి, సబిత, మౌనిక, సురేష్, దీపారాణి, సిబ్బంది రాజన్న, అనసూర్య, ప్రభాకర్ పాల్గొన్నారు
హెరెత్తించిన ఫ్రెషర్స్ డే వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES