నవతెలంగాణ – హైదరాబాద్ : గుండెపోటుతో కోలీవుడ్ స్టంట్ మాస్టర్ రాజు మృతి చెందడంతో హీరో విశాల్ సినిమా షూటింగ్‌లో విషాదం నెలకొంది. హీరో ఆర్య, డైరెక్టర్ పా.రంజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో ఈ దుర్ఘటన జరిగింది. చెన్నైలోని నాగపట్నం సమీపంలో కారుతో స్టంట్స్ చేస్తుండగా రాజు గుండెపోటుకు గురయ్యారు. వెంటనే చిత్ర బృందం ఆయనను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. స్టంట్ మాస్టర్ రాజు మృతి పట్ల హీరో విశాల్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రాజు ధైర్యవంతుడని కొనియాడిన విశాల్, తాను నటించిన అనేక చిత్రాల్లో ఆయన సాహసోపేతమైన స్టంట్స్ చేశారని గుర్తు చేసుకున్నారు.
గుండెపోటుతో స్టంట్ మాస్టర్ రాజు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES