Tuesday, November 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఉద్యోగుల కుల వివరాలు సమర్పించండి

ఉద్యోగుల కుల వివరాలు సమర్పించండి

- Advertisement -

రాష్ట్ర బీసీ కమిషన్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో 45 ప్రభుత్వ విభాగాల ఉద్యోగుల కుల వివరాలు సమర్పించాలని రాష్ట్ర బీసీ కమిషన్‌ కోరింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని కమిషన్‌ కార్యాలయంలో చైర్మెన్‌ జి.నిరంజన్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషన్‌ సభ్యులు రాపోలు జయప్రకాష్‌, తిరుమలగిరి సురేందర్‌, రంగు బాలలక్ష్మి, కమిషన్‌ మెంబర్‌ సెక్రెటరీ బాల మాయదేవి పాల్గొన్నారు. సమావేశానికి డిప్యూటి డైరెక్టర్‌ యు. శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి కె.మనోహర్‌ రావు, ప్రత్యేక అధికారి ఎన్‌. సునీత, సెక్షన్‌ ఆఫీసర్‌ జి. సతీష్‌ కుమార్‌ హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతున్న సీడ్‌ పథకానికి అర్హులకు కావాల్సిన డీఎన్జీ సర్టిఫికెట్‌ జారీ, విధివిధానాలపై చర్చించారు. దీనిపై త్వరలోనే కమిషన్‌ తన నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వంలో పని చేస్తున్న ఉద్యోగుల కుల వివరాల సేకరణపై కమిషన్‌ చర్చించింది. వివరాల సేకరణ చివరి దశకు చేరుకుందనీ, మొత్తం 345 ప్రభుత్వ విభాగాల్లో 45 ప్రభుత్వ విభాగాలు వివరాలు అందించాల్సి ఉందని గుర్తించింది. త్వరితగతిన ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. మరో 10 రోజుల్లో వివరాలు సమర్పించని విభాగాల కార్యదర్శులతో సమావేశం నిర్వహించాలని కమిషన్‌ నిర్ణయించింది. మరోవైపు విద్యార్థుల వివరాల సేకరణ కూడా వేగవంతం చేయాలని కమిషన్‌ నిర్ణయిం చింది. వీటితో పాటు కమిషన్‌ కార్యాలయంలో బీసీ కులాలకు సంబంధించిన పుస్తకాలు, రీసెర్చ్‌ మెటీరియల్‌, వివిధ రిపోర్టులు తదితర వాటితో లైబ్రరీని పటిష్ఠపరచాలని కమిషన్‌ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక రీసెర్చ్‌ అసోసియేట్‌ను నియమించాలని కమిషన్‌ నిర్ణయించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -