మండల వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డి
నవతెలంగాణ – అలంపూర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2025-26 క్రింద రైతులకు రాయితీ పై ఇస్తున్న వ్యవసాయ పనిముట్లు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు సన్న చిన్న కారు రైతులకు 50 శాతం సబ్సిడీ పై జనరల్ కేటగిరీ రైతులకు 40 శాతం సబ్సిడీ పై అందిస్తున్న వ్యవసాయ పనిముట్లు రోటవేటర్, కల్టివేటర్లు, పవర్ స్ర్పేయర్లు, పవర్ వీడర్, సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్, బండ్ ఫార్మర్, బ్రష్ కట్టర్, పవర్ టిల్లర్లు, బ్యాటరి స్పేయర్లు సబ్సిడీ పై ఇస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న అర్హులైన రైతులు దరఖాస్తు ఫారం, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, ట్రాక్టర్‌కు సంబంధించిన పనిముట్లు అయితే ట్రాక్టర్ ఆర్సి జిరాక్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తో సంబంధిత ఏఈవోలకు ఈ నెల 22వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తుల స్వీకరణ తరువాత జిల్లా, మండల స్థాయి కమిటీల ద్వారా అర్హులైన రైతులను గుర్తించి పరికరాలు అందించడం జరుగుతుందని, రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాగార్జున రెడ్డి కోరారు.
రాయితీ వ్యవసాయ పనిముట్లను సద్వినియోగం చేసుకోవాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES