Sunday, May 18, 2025
Homeసినిమాతెలుగులోనూ విజయం ఖాయం

తెలుగులోనూ విజయం ఖాయం

- Advertisement -

బాలీవుడ్‌ కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌ నటించిన హిస్టారికల్‌ కోర్ట్‌ డ్రామా ‘కేసరి ఛాప్టర్‌ 2: ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ జలియన్‌వాలా బాగ్‌’. బాలీవుడ్‌లో విడుదలైన ఈ సినిమా విశేష ప్రేక్షకా దరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతూ, ఇప్పటికే దాదాపు రూ.100 కోట్ల వసూళ్లు సాధిం చింది. కరణ్‌ సింగ్‌ త్యాగీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నాలుగో వారంలోను హౌస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. అక్షరు కుమార్‌, ఆర్‌.మాధవన్‌, అనన్య పాండే నటించిన తీరు, ఎమోషన్స్‌తో నిండిన కోర్ట్‌ సన్నివేశాలకు విశేష ప్రశంసలు లభించాయి. ఇప్పుడు ఈ చిత్రం తెలుగులోకి అనువాదితమై, ఈనెల 23న విడుదల కాబోతుంది. ఇప్పటికే హిందీ వెర్షన్‌కు విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ వసూళ్లు రావడంతో, తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. తాజాగా తెలుగు ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు. జలియాన్‌ వాలా బాగ్‌ హత్యాకాండ తరువాత జరిగిన సంఘ టనలు, బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని ఎదిరించి, అక్షయ కుమార్‌ పాత్ర చేసిన న్యాయపోరాటాన్ని అద్భుతంగా ప్రజెంట్‌ చేసిన ఈ ట్రైలర్‌ అదిరిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ భారీగా విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. బాలీవుడ్‌లో మాదిరిగానే తెలుగులోనూ ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ అవుతుందనే నమ్మకాన్ని సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేతలు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -