- Advertisement -
నవతెలంగాణ మోపాల్
శుక్రవారం రోజున మోపాల్ మండలంలోని ముదక్ పల్లి గ్రామాన్ని జిల్లా పంచాయతీ అధికారి డి శ్రీనివాస్ సందర్శించి గ్రామంలోని పచ్చదనం పరిశుభ్రత ,ఇంటింటికి చెత్త సేకరణ గురించి వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది అలాగే గ్రామపంచాయతీ రికార్డులను తనిఖీ చేసినారు ఆ తర్వాత గ్రామంలో ఉన్న నర్సరీని వైకుంఠ ధామాన్ని సందర్శించి పంచాయతీ కార్యదర్శి కి వేసవి కాలంలో గ్రామంలో మంచినీటి సమస్య ఉండొద్దని అలాగే వివిధ సమస్యల గురించి తగిన సూచనలు చేశారు. ఆయన వెంట పంచాయతీ అధికారి కిరణ్ కుమార్ పంచాయతీ కార్యదర్శులు సురేష్ ,వెంకటేష్, మృదుల, పద్మజ మరియు కారోబార్ శ్రీనివాస్ పాల్గొన్నారు
- Advertisement -