నవతెలంగాణ-హైదరాబాద్ : ఎంతో కాలంగా పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోరుకుంటున్న బలూచిస్తాన్ ఇటీవల తమను తాము స్వాతంత్ర్యం దేశంగా ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అయితే పాక్ నుంచి విడిపోయిన వెంటనే పాలన ఏర్పాటు దిశగా బలోచ్ ప్రయత్నం చేస్తుండగా పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థలు మాత్రం మరోసారి వారిపై విరుచుకుపడుతున్నారు. అవకాశం దొరికితే చాలు భారీ బ్లాస్టింగ్స్ చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఓ మార్కెట్ సమీపంలో బాంబులతో దాడి చేశారు.
దీనికి వ్యతిరేకంగా తాజాగా నైరుతి పాకిస్తాన్‌లోని బలోచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఖుజ్దార్ జిల్లాలో స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి చేశారు. కారు బాంబు ద్వారా నేరుగా విద్యార్థులు ప్రయాణిస్తున్న స్కూల్ బస్సును టార్గెట్ చేసుకొని ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఈ దాడిలో నలుగురు పిల్లలు మృతి చెందగా మరో 38 వరకు గాయపడినట్లు తెలుస్తుంది. గాయపడిన వారిని కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్ (సీఎంహెచ్)కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ దాడికి ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు.
స్కూల్ బస్సుపై ఆత్మాహుతి బాంబు దాడి.. నలుగురు పిల్లలు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES