- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
చేనేత పని సరిగా నడవకపోవడం.. కుటుంబ పోషణ భారమై.. ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన దుబ్బాక పట్టణ కేంద్రంలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన గోరిటాల బాలరాజు (48) దుబ్బాక చేనేత సహకార సంఘంలో గతంలో కార్మికుడిగా పనిచేశాడు. కొంతకాలంగా చేనేత పని లేకపోవడంతో పలిచోట్ల కూలిగా పనిచేస్తున్నారు. కుటుంబ పోషణ భారమై ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైనాయి. దీంతో జీవితంపై విరక్తి చెందాడు. సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని చనిపోయాడు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని దుబ్బాక ఎస్ఐ వీ.గంగరాజు తెలిపారు.
- Advertisement -