Wednesday, May 28, 2025
Homeతెలంగాణ రౌండప్పెర్కిట్ ఉన్నత పాఠశాల యందు సమ్మర్ క్యాంప్ ప్రారంభం

పెర్కిట్ ఉన్నత పాఠశాల యందు సమ్మర్ క్యాంప్ ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ  – ఆర్మూర్ 
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్  కోర్స్  డైరెక్టర్ , మండల విద్యాధికారి  రాజ గంగారం   ఆదివారం ప్రారంభించారు . పి ఆర్ టి యు  మండల అధ్యక్షులు ఇట్టం గోపాల్ , ప్రధాన కార్యదర్శి సంగే అశోక్ , కార్యదర్శి సౌడ సంతోష్   లు మాట్లాడుతూ చక్కటి ప్రోగ్రాం ని మండలంలోని విద్యార్థులు అందరూ ఉపయోగించుకోవాలని పిఆర్టియు  పక్షాన కోరుచున్నాము అని అన్నారు. ఆర్ట్ డాన్స్ మ్యూజిక్ ఎంబ్రాయిడరీ విభాగంలో శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి మండలంలోని ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు అందరినీ పంపవలసిందిగా ప్రధానోపాధ్యాయులకు  ఉపాధ్యాయులకు పిఆర్టియు పక్షాన కూర్చున్నాం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మనందరం కలిసి విజయవంతం చేద్దాం. ఇకముందు కూడా మంచి మంచి ప్రోగ్రాములు చేయడానికి ప్రభుత్వానికి ఈ కార్యక్రమం విజయవంతం ద్వారా తెలియజేద్దాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కోర్సు కన్వీనర్ పాఠశాల ప్రధా నో పాధ్యాయులు శ్రీనివాస్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -