Saturday, May 3, 2025
Homeతెలంగాణ రౌండప్సీఐటీయూ పోరాట ఫలితమే అంగన్వాడీలకు వేసవి సెలవులు

సీఐటీయూ పోరాట ఫలితమే అంగన్వాడీలకు వేసవి సెలవులు

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు
సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: సిఐటియు పోరాట ఫలితమే అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు మంజూరయ్యాయని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం సిఐటియు జిల్లా కార్యాలయం అంగన్వాడీ టీచర్లు మినీ టీచర్లు ఆయాలు వేసవి సెలవులను ప్రకటించినందుకు సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ..తేదీ: 30.4.2025 న ఐసిడిఎస్ డైరెక్టర్ ఆఫీసులో డైరెక్టర్ కాంతివేస్లీ గారు సంబంధిత అధికారులు అంగన్వాడీ యూనియన్లతో జాయింట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి సిఐటియు యూనియన్ నుండి రాష్ట్ర అధ్యక్షురాలు కే.సునీత ప్రధాన కార్యదర్శి పి. జయలక్ష్మి, ఉపాధ్యక్షురాలు కే.సమ్మక్క పాల్గొన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలకు మే నెలంతా సెలవులు ఇస్తున్నామని తెలియజేశారు. ఇతర సేవలు అందించటం కోసం అంగన్వాడి ఉద్యోగులందరూ కృషి చేయాలని అన్నారు.
ఈ నిర్ణయం వెలువడిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి సిఐటియు తరఫున కృతజ్ఞతలు తెలియజేశాము. సిఐటియు సంఘం ఆధ్వర్యంలో మే నెలంతా సెలవులు ఇవ్వాలని, నిరంతరం అనేక పోరాటాలు నిర్వహించాము. మార్చ్ 4 న ప్రజావాణి ముట్టడి చేశాము. మార్చి 17,18 తేదీల్లో 48 గంటల ధర్నా నిర్వహించాము. ఏప్రిల్ 24 న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాము. నిన్న ఏప్రిల్ 29న ములుగు జిల్లాలో మంత్రి క్యాంపు ఆఫీసు ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించాము. ఈ ధర్నా ఫలితంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ మీటింగ్ నిర్వహించి మే నెలంతా సెలవులు ఇస్తూ నిర్ణయం చేయాల్సి వచ్చింది. ఇది సిఐటియు పోరాట ఫలితం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఐసిడిఎస్ 50 సంవత్సరాల చరిత్రలో ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో మే నెలంతా సెలవులు నిర్ణయం చేసినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము. రిటర్మెంట్ అయినా అంగన్వాడి టీచర్లకు ఆయాలకు రిటర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ఉన్నారు. మినీ టీచర్లకు బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని అన్నారు. ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను కనీస వేతనాలు ఉద్యోగ భద్రత ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం వారసత్వాన్ని కొనసాగించాలని అన్నారు.ఇదే స్ఫూర్తితో పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో మరిన్ని సమరశీల పోరాటాలకు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ మినీ టీచర్స్ అందరు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ జిల్లా కార్యదర్శి స్వర్ణ, వాణి,   సునీత, జరీనా , సందీప, సరిత,  లలిత,   అనీష్,   సరస్వతి,   స్రవంతి, స్వాతి తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -