Friday, April 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వడదెబ్బ.. జర జాగ్రత్త.!

వడదెబ్బ.. జర జాగ్రత్త.!

- Advertisement -

రోజురోజుకు అధికమవుతున్న ఎండ తీవ్రత..
నవతెలంగాణ – మల్హర్ రావు

ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది.వివిధ పనుల నిమిత్తం ఇళ్ల నుంచి బయటకు వెళ్లేవారు వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దాహం వేయకపోయినా సరే గంటకోసారి గ్లాసు నీళ్లు,మజ్జిగ,నిమ్మరసం,చెరుకు రసం వంటివి తీసుకుంటే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంగా ఉంటాయి. నూనెలో వేయించిన పదార్థాలు, మసాలాలు తగ్గించి..పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసు కోవాలి.కాఫీ,టీ,ఆల్కహాల్ శరీరంలోని నీటి శాతాన్ని తగ్గిస్తాయి. వీటికి దూరంగా ఉండటం మంచిది.ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4గం టల సమయంలో సాధ్యమైనంత వరకు బయటకు వెళ్లకపోవడమే ఉత్తమం.

వదులుగా ఉండే నూలు దస్తులు ధరించాలి. ఇవి గాలిని లోపలికి పంపి చెమటను త్వరగా పీల్చు కుంటాయి.బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా గొడుగు, టోపీ,తలపాగా ధరించాలి.కళ్లకు సన్గ్లాసెస్ పోట్టుకోవడం మంచిది.వయస్సు పైబడిన వారికి వాతావరణ మార్పులను తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది. వారికి రాత్రివేళ చల్లటి గాలుల ద్వారా జలుబు,జ్వరం, శ్వాసకోశ సమస్య లు, కీళ్ల నొప్పులు రావొచ్చు.పగటి వేళ అధిక ఉష్ణోగ్రతల కారణంగా డీహైడ్రేషన్, రక్తపోటులో మార్పులు సంభవించే అవ కాశం ఉంది. వారి గదుల్లో ఫ్యాన్, కూలర్ వంటివి ఉండేలా చూసుకోవాలి.ఇంట్లో కిటికీలకు పరదాలు వేసి ఉంచాలి. గది ఉష్ణోగ్రత తక్కువగా ఉండేలా చూసుకోవాలి.

రోజుకు రెండ్లుసార్లు చల్లని నీటీతో స్నానం చేయాలి.వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడ ఉన్న చల్లని జాగ్రత్తలు తప్పనిసరి.ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే బయటకు వెళ్ల కుండా ఉండాలి. ఓఆర్ఎస్, మజ్జిగ తీసుకోవాలి. ఎండలో పనిచేసేవారు మధ్య మధ్యలో నీడలో విశ్రాంతి తీసుకోవాలి. శరీరం డీహై డ్రేషన్కు గురికాకుండా జాగ్రత్తపడాలి.తల నొప్పి, నీరసంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.వడదెబ్బ తగిలిన వారిని నీడ ప్రదేశానికి తరలించాలి. దస్తులను వదులు చేయాలి.

తడిగుడ్డతో ఒళ్లంతా తుడుస్తూ ఉండాలి.చంకలు, మెడ భాగంలో ఐస్ ప్యాక్లు ఉంచాలి. ఓఆర్ఎర్ కలిపిన నీటిని తాగించాలి.పార్కింగ్ చేసిన కార్లలో చిన్నపిల్లలను, పెంపుడు జంతువులను వదిలి వెళ్లొద్దు. కార్లలో ఉష్ణోగ్రత చాలా వేగంగా పెరుగుతుంది. ఖాళీ కడుపుతో బయటకు వెళ్తే త్వరగా నీరసం వస్తుంది.బయట చేసే పనులను ఉదయం 8గంటల లోపు లేదా సాయంత్రం 6 గంటల తర్వాత ప్లాన్ చేసుకోండి.నీటిశాతం ఎక్కువగా ఉన్న పుచ్చకాయ, ఖర్బూ జా, తాటిముంజలు, దోసకాయలను ఆహారంలో తీసుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -