– లక్నోపై ఆరు వికెట్లతో ఘన విజయం
నవతెలంగాణ-లక్నో
సన్‌రైజర్స్ హైదరాబాద్ మురిసింది. ఐపీఎల్18లో నాల్గో విజయం నమోదు చేసిన ఆరెంజ్ ఆర్మీ సీజన్‌ను మెరుగ్గా ముగించేందుకు సిద్ధమవుతోంది. సోమవారం లక్నోలో లక్నో సూపర్‌జెయింట్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. సన్‌రైజర్స్ చేతిలో ఓటమితో ప్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో సూపర్‌జెయింట్ నిష్క్రమించింది. 206 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ అలవోకగా ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (59, 20 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. పవర్‌ప్లేలో లక్నో బౌలర్లను ఉతికారేసిన అభిషేక్ శర్మ సన్‌రైజర్స్‌ను గెలుపు దిశగా నడిపించాడు. ఇషాన్ కిషన్ (35), హెన్రిచ్ క్లాసెన్ (47, 28 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), కామిందు మెండిస్ (32, 21 బంతుల్లో 2 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు. అనికెత్ వర్మ (5 నాటౌట్), నితీశ్ కుమార్ రెడ్డి (5 నాటౌట్) లాంఛనం ముగించారు. మరో 10 బంతులు ఉండగానే సన్‌రైజర్స్ 206/4 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. సూపర్‌జెయింట్స్ ఓపెనర్లు మిచెల్ మార్ష్ (65, 39 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఎడెన్ మార్‌క్రామ్ (61, 38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. తొలి వికెట్‌కు 10.3 ఓవర్లలోనే 115 పరుగులు జోడించిన ఓపెనర్లు భారీ స్కోరుకు గట్టి పునాది వేశారు. మిడిల్ ఆర్డర్‌లో నికోలస్ పూరన్ (45, 26 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ రాణించలేదు. కెప్టెన్ రిషబ్ పంత్ (7) వైఫల్యం కొనసాగగా.. ఆయుశ్ బదాని (3), అబ్దుల్ సమద్ (3), శార్దుల్ ఠాకూర్ (4) నిరాశపరిచారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఈషన్ మలింగ (2/28) రెండు వికెట్లతో మెరువగా.. హర్ష్ దూబె (1/44), హర్షల్ పటేల్ (1/49), నితీశ్ కుమార్ రెడ్డి (1/28) రాణించారు.
సన్‌రైజర్స్ మురిసింది
- Advertisement -
- Advertisement -