నవతెలంగాణ – హైదరాబాద్: ఉజ్బెకిస్థాన్, గాంబియా దేశాలలో భారతీయ దగ్గు మందుల వల్ల పిల్లలు మరణించిన ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. నాణ్యతా ప్రమాణాలు లేని ఔషధాల తయారీ, అమ్మకాలకు పాల్పడిన ఫార్మా సంస్థ, దాని అధికారులకు సమన్లు జారీ చేసింది. డబ్బు కోసమే ఈ వ్యాపారం చేస్తున్నారా? మీ చర్యల వల్ల దేశ ప్రతిష్ట దెబ్బతింటోంది అని ధర్మాసనం మండిపడింది. ఈ కేసులో ఫార్మా సంస్థ, కొందరు అధికారులపై 2024 జనవరిలో యూపీలోని గౌతమ బుద్ధ నగర్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సమన్లు జారీ చేశారు. అలహాబాద్ హైకోర్టు వీటిని కొట్టివేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మందులలో డై ఇథిలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ అనే విషపూరిత రసాయనాలు కలవడం వల్ల కిడ్నీలు దెబ్బతిని మరణాలు సంభవిస్తున్నట్లు తేలింది.
దగ్గు మందు మరణాలపై సుప్రీం ఆగ్రహం.. సంస్థ, అధికారులకు సమన్లు
- Advertisement -
- Advertisement -



