- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. ఎమ్మెల్సీల ఎంపికకు అడ్డంకిగా తమ ఉత్తర్వులు లేవని తేల్చి చెప్పింది. గతేడాది ఆగస్టు 13 నాటి మధ్యంతర ఉత్తర్వుల్లోనే స్పష్టంగా చెప్పామని జస్టిస్ విక్రంనాథ్ ధర్మాసనం తెలిపింది. కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. తమ ఎన్నికపై జారీ చేసిన ఉత్తర్వులు ఎత్తివేయాలని అమిర్ అలీ సుప్రీంకోర్టులో వెకేట్ పిటిషన్ వేశారు. అమిర్ అలీ పిటిషన్‌ను దాసోజు శ్రవణ్ వేసిన ప్రధాన పిటిషన్‌తో జతచేస్తూ ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ధర్మాసనం మార్చి 19కి వాయిదావేసింది.
- Advertisement -



