Thursday, May 22, 2025
Homeజాతీయంజస్టిస్‌ వర్మపై FIR పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

జస్టిస్‌ వర్మపై FIR పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

- Advertisement -

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్: అక్రమ నోట్ల కట్టలు వెలుగుచూసిన కేసులో హైకోర్టు జడ్జి యశ్వంత్‌ వర్మపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్ దాఖలుకు నిరాకరించింది. జస్టిస్‌ వర్మ ప్రతిస్పందనతో పాటు మాజీ సిజెఐ రాష్ట్రపతి, ప్రధానులకు రాసిన లేఖలు, అంతర్గత విచారణ కమిటీ నివేదిక, మే 8న సుప్రీంకోర్టు విడుదల చేసిన పత్రికా ప్రకటనను పరిశీలించినట్లు జస్టిస్‌ అభరు ఎస్‌.ఓకా, జస్టిస్‌ ఉజ్వల్‌ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. మాండమస్‌ రిట్‌ (ప్రభుత్వ అధికారిని ఆదేశించే కోర్టు ఉత్తర్వు) కోరే ముందు, పిటిషనర్‌ తగిన అధికారుల ముందు ప్రాతినిథ్యం దాఖలు చేయడం ద్వారా తమ ఫిర్యాదును పరిష్కరించుకోవాలని ధర్మాసనం పేర్కొంది. ఈ రిట్‌ పిటిషన్‌ను స్వీకరించేందుకు తాము నిరాకరిస్తున్నామని, ఈ దశలో ఇతర విజ్ఞప్తులను పరిశీలించాల్సిన అవసరం లేదని ధర్మాసనం తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -