Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలు65 లక్షల మంది ఓటర్ల వివరాలను వెల్లడించాలి..ఇసిని ఆదేశించిన సుప్రీంకోర్టు

65 లక్షల మంది ఓటర్ల వివరాలను వెల్లడించాలి..ఇసిని ఆదేశించిన సుప్రీంకోర్టు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ :   బీహార్‌ ముసాయిదా ఓటర్ల జాబితా నుండి తొలగించబడిన 65లక్షల మంది ఓటర్ల వివరాలను ఆగస్ట్‌ 9లోపు సమర్పించాలని సుప్రీంకోర్టు భారత ఎన్నికల సంఘం (ఇసి)ని ఆదేశించింది. ఈ పిటిషన్‌ను బుధవారం ఉదయం జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఉజ్వల్‌ భుయాన్‌, జస్టిస్‌ ఎన్‌.కె.సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఎదుట అసోసియేట్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌) తరపున న్యాయవాది ప్రశాంత్‌ భూషన్‌ ప్రస్తావించారు. ఓటర్ల తొలగింపుపై ఇసిఐ ప్రతిస్పందన తెలపాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఆగస్ట్‌ 12కి వాయిదా వేసింది.

బీహార్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ముసాయిదాను ఇసి ఆగస్ట్‌ 1న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ముసాయిదా ఓటర్ల జాబితా 65 లక్షల ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయని తెలిపింది. కానీ ఆ 65లక్షల పేర్ల జాబితా ఇవ్వబడలేదు. అందులో 32 లక్షల మంది వలసవెళ్లారని చెబుతున్నారు. ఇతర వివరాలు లేవు. 65 లక్షల మంది ఎవరని ఇసి వెల్లడించాలి. ఎవరు వలస వెళ్లారు మరియు ఎవరు మరణించారు.

స్పష్టంగా ఏ వ్యక్తిని బూత్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ (బిఎల్‌ఓలు ) తొలగించాలని లేదా తొలగించకూడదని సిఫారసు చేశారు అనే వివరాలు పూర్తిగా వెల్లడించాలి. కేవలం రెండు నియోజకవర్గాలకు మాత్రమే వివరాలు ప్రచురించారు. కానీ ఇతర ప్రాంతాల సంగతేంటి ఈ రెండు బహిర్గతం చేయాలని కోరుతున్నామని ప్రశాంత్‌ భూషణ్‌ వాదించారు. మరణాలు, రాష్ట్రం నుండి శాశ్వతంగా వెళ్లడం, నకిలీ పేర్లు, ఆచూకీ తెలియకపోవడం వంటి కారణాలతో ఓటర్ల పేర్లను తొలగించినట్లు పేర్కొంది. అయితే నియోజకవర్గాల వారీగా లేదా బూత్‌ల వారీగా, డ్రాప్ట్‌ రోల్‌లో ప్రతి పేరు తొలగింపుకు గల కారణాన్ని వ్యక్తిగతంగా చూపలేదని పేర్కొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad