నవతెలంగాణ-హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడిపై న్యాయ విచారణ కోరుతూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి దాఖలు చేసిన పిల్‌పై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ”ప్రతి పౌరుడు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేతులు కలపాల్సిన సమయం ఇది. ఇటువంటి పిటిషన్లతో వారి మనోధైర్యాన్ని దెబ్బతీయకండి” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ”ఇటువంటి విషయాల్లో జడ్జీలు నిపుణులు కారు” అని పేర్కొంది. భద్రతాదళాలను నిరాశపరచాలనుకుంటున్నారా, ఇటువంటి అంశాలను న్యాయపరిధిలోకి తీసుకురావద్దని ఆదేశించింది. పిల్‌ను ఉపసంహరించుకున్నందున కొట్టివేసినట్లు ప్రకటించింది.
- Advertisement -