Monday, July 21, 2025
E-PAPER
Homeజాతీయంఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడా) భూముల అక్రమ కేటాయింపుల కేసులో దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించి కర్ణాటక హైకోర్టు తీర్పును ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ ను పరిశీలించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ ల ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. భూముల అక్రమ కేటాయింపుల వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతి, రాష్ట్ర మంత్రి సురేశ్ లకు జారీ చేసిన సమన్లను హైకోర్టు కొట్టివేసిందని ఈడీ గుర్తుచేసింది.

ఈ తీర్పును సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలిస్తూ.. ఈ వ్యవహారంలో ఈడీ రాజకీయ పోరాటం చేస్తోందని సుప్రీం ధర్మాసనం విమర్శించింది. ఇది ముమ్మాటికీ అధికార దుర్వినియోగం కిందకే వస్తుందని వ్యాఖ్యానించింది. పిటిషన్ పరిగణనలోకి తీసుకోవడంలేదని స్పష్టం చేసింది. ఈడీని రాజకీయ పోరాటాలకు ఎందుకు ఉపయోగిస్తున్నారంటూ న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ కేసు విచారణకు స్వీకరించడంపై సీజేఐ బెంచ్ అయిష్టత వ్యక్తం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -