- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: వీధికుక్కలకు స్టెరిలైజేషన్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగస్టు 22న ఉత్తర్వులిస్తే.. ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. వీధికుక్కల దాడులపై రోజూ మీడియాలో వార్తలు వస్తున్నా చలనం లేదా? అని మండిపడింది. స్పందించని సీఎస్‌లు అందరూ తదుపరి విచారణలో తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఇన్ని రోజలు కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదో స్పష్టమైన వివరణ ఇవ్వాలని త్రిసభ్య ధర్మాసనం కోరింది.
- Advertisement -



