నవతెలంగాణ – హైదరాబాద్: అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న నటుడు దర్శన్‌కు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. న్యాయాధికారాన్ని దుర్వినియోగం చేశారని వ్యాఖ్యానించింది. హైకోర్టు చేసిన తప్పును తాము పునరావృతం చేయబోమని స్పష్టం చేసింది. దోషిగా లేదా నిర్దోషిగా ప్రకటన చేసేందుకు ఇప్పుడే ఎలాంటి తీర్పు వెలువరించబోమని ప్రధాన నిందితురాలు పవిత్ర గౌడ తరఫు న్యాయవాదికి సుప్రీంకోర్టు తెలియజేసింది.
అరెస్టు చేయడానికి తగిన ఆధారాలు లేవని హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దిగువ కోర్టు పొరపాటు చేస్తే పరిగణనలోకి తీసుకోవచ్చని, కానీ హైకోర్టు న్యాయమూర్తి అలా చేయడం ఆమోదయోగ్యం కాదని తెలిపింది.