నవతెలంగాణ-హైదరాబాద్: వీడియోలు, సెల్ఫీలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కోర్టు ఆవరణలో కెమెరాలు, ట్రైపాడ్లు, సెల్పీ స్టిక్‌లు, మొబైల్ ఫోన్ల ద్వారా వీడియోలు, రీల్స్ చేయడాన్ని సుప్రీంకోర్టులో బ్యాన్ చేసింది.శుక్రవారం కోర్టు సెక్రటరీ జనరల్ ఈ సర్క్యూలర్ జారీ చేశారు. ఆ ఆదేశాలు లాయర్లు, ఫిర్యాదుదారులు, ఇంటర్న్‌లు, న్యాయ క్లర్క్‌లు, స్టాఫ్, విజిటర్స్‌కు వర్తించనున్నాయి. కేవలం అధికార ప్రోగ్రామ్‌లకు మాత్రమే ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అనుమతించనున్నారు. ఆదేశాలు ఉల్లంఘించే అడ్వకేట్లు, ఇంటర్న్‌లు, న్యాయ సిబ్బందిని సంబంధిత బార్ అసోసియేషన్లకు ఫిర్యాదు చేస్తారు. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. హై సెక్యూర్టీ జోన్‌లో ఎవరు ఫోటోలు, వీడియోలు తీసినా వారిని అడ్డుకునే అధికారం సెక్యూర్టీ సిబ్బందికి ఉంటుంది.మీడియా వ్యక్తులు కూడా తమ ఇంటర్వ్యూలు, లైవ్ బ్రాడ్‌కాస్ట్‌లు.. నిర్దేశిత లో సెక్యూర్టీ జోన్ నుంచి చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా రిపోర్టర్ ఆ నియయావళి ఉల్లంఘిస్తే, అతనికి హై సెక్యూర్టీ జోన్‌లో నెల రోజుల పాటు నిషేధం విధించనున్నారు.
వీడియోలు, సెల్ఫీలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
- Advertisement -
- Advertisement -