Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంరామసేతుకు జాతీయ హోదాపై ‘సుప్రీం’ కీల‌క ఆదేశాలు

రామసేతుకు జాతీయ హోదాపై ‘సుప్రీం’ కీల‌క ఆదేశాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: రామసేతువును జాతీయ వారసత్వ కట్టడంగా ప్రకటించాలన్న డిమాండ్‌పై సుప్రీంకోర్టు కీలక ముందడుగు వేసింది. ఈ అంశంపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నిర్దిష్ట సమయంలోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ స్వామి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) డైరెక్టర్, ఏఎస్ఐ తమిళనాడు ప్రాంతీయ డైరెక్టర్‌ ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. స్వామి తరఫున సీనియర్ న్యాయవాది విభా దత్తా మఖిజా, న్యాయవాది సత్య సబర్వాల్ వాదనలు వినిపించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad