– టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీహార్‌లో ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల జాబితాపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం ప్రజాస్వామ్యానికి గొప్ప విజయమని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ అభిప్రాయపడ్డారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65 లక్షల ఓటర్ల పేర్లను 48 గంటల్లో ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించాలని కోర్టు ఆదేశించడం పట్ల ఆయన ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓట్ చోరీపై లోక్‌సభలో లేవనెత్తిన ఆరోపణలు ఈ తీర్పుతో రుజువ య్యాయని పేర్కొన్నారు. ఓట్ చోరీపై చర్చించాలంటూ ఆయన పట్టుపట్టినా కేంద్రం స్పందించకపోవడం విచారకరమని విమర్శించారు. ఆధార్ లింక్‌తో ‘ఒక ఓటు-ఒక మనిషి’ విధానాన్ని అమలు చేయాలన్న రాహుల్‌గాంధీ డిమాండ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించాలని కోరారు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించారు. సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఆయన హర్షం ప్రకటించారు.
మంత్రి శ్రీధర్‌బాబుకు అభినందలను
పీపుల్ ఇన్ ఏఐ జాబితాలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు చోటు లభించడం పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ అభినందనలు తెలిపారు. వంద మంది అత్యంత ప్రభావిత వ్యక్తుల్లో ఆయన ఒకరు కావడం హర్షణీయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో అన్ని రంగాల్లో అత్యంత ప్రతిభ కనబరుస్తూ ప్రజాపాలన సాగిస్తున్నదని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏ.ఐ రంగం దూసుకుపోతున్న క్రమంలో ఆయన ఏ.ఐ ఆధారిత కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ అనేక చర్యలు తీసుకుంటున్నారని మహేశ్‌కుమార్ కొనియాడారు.
ఓట్లపై ‘సుప్రీం’ తీర్పు ప్రజాస్వామ్య విజయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES