నవతెలంగాణ-నకిరేకల్
నకిరేకల్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను శనివారం మండల ప్రత్యేక అధికారి డాక్టర్ ఎస్. కిరణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల డైనింగ్ హాల్, వంటగది, బియ్యం నిల్వల గదులను పరిశీలించారు. వంట సామాగ్రి గదిలో బియ్యం బస్తాలు బండలపై నిల్వ చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. బియ్యం బస్తాలను ఐరన్ స్టూళ్లపై నిల్వ ఉంచాలని సూచించారు. రికార్డుల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని సరిపోను అందించాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారా.. లేదా.. అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. వారి వెంట పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ సుకన్య, సిబ్బంది ఉన్నారు.
గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



