Saturday, July 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసర్‌ప్రైజ్‌ చేసే గ్లింప్స్‌

సర్‌ప్రైజ్‌ చేసే గ్లింప్స్‌

- Advertisement -

హీరో కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘కె-ర్యాంప్‌’. ఇది హీరోగా ఆయన నటిస్తున్న 11వ చిత్రం. హాస్య మూవీస్‌, రుద్రాంశ్‌ సెల్యులాయిడ్‌ బ్యానర్‌ల రాజేష్‌ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. జైన్స్‌ నాని దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఓ స్పెషల్‌ వీడియోతో ఈ సినిమా నుంచి ‘రిచెస్ట్‌ చిల్లర్‌ గరు’ గ్లింప్స్‌ రిలీజ్‌ అప్డేట్‌ను మేకర్స్‌ ఇచ్చారు. ఈ నెల 14న ఈ గ్లింప్స్‌ రిలీజ్‌ చేయబోతున్నారు. కొచ్చి పోర్ట్‌ లొకేషన్‌లో కిరణ్‌ అబ్బవరం, దర్శకుడు జైన్స్‌ నాని మధ్య సరదా సంభాషణతో రూపొందించిన ఈ అనౌన్స్‌మెంట్‌ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ మూవీ దీపావళికి గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -