Saturday, January 31, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ తిరుపతి సస్పెన్షన్

 డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ తిరుపతి సస్పెన్షన్

- Advertisement -

నవతెలంగాణ-జన్నారం

కవ్వాల్ టైగర్ జోన్ జన్నారం అటవీ డివిజన్ పరిధిలో జన్నారం రేంజ్ డిప్యూటీ అధికారి గా విధులు నిర్వహిస్తున్న తిరుపతిని  సస్పెండ్ చేసినట్లు ఎఫ్ డి పి టి శాంతారావు, మంచిర్యాల డిఎఫ్ఓ శివ్ ఆశిష్ సింగ్ బుధవారం తెలిపారు. జన్నారం అటవీ రేంజ్ కొత్తూరు పల్లె సమీపంలోని రిజర్వ్ అటవీ ప్రాంతంలో అక్రమంగా గుడిసెలు వేసుకుని ఉన్న 22 మంది గిరిజనుల గుడిసెలను అటవీ అధికారులు దాడి చేసి తొలగించడం, అటవీ భూముల సంరక్షణలో నిర్లక్ష్యంవాహించినందుకు గాను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. అటవీ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -