నవతెలంగాణ-హైదరాబాద్: మొదటి విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో యూఎస్-ఇండియా ట్రేడ్ డీల్‌పై ఉభయ సభల్లో చర్చ పెట్టాలని విపక్షాలకు చెందని 8 మంది ఎంపీలు స్పీకర్ పోడియం ఎదుట శాంతియుతంగా ఆందోళన చేపట్టారు. అందుకు అనుమతిచ్చని స్పీకర్ ఓం బిర్లా వారిని సస్పెండ్ చేశారు. తాజాగా రెండో విడత పార్లమెంట్ సమావేశాల్లో లోక్‌సభ(Lok Sabha)లో 8 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేశారు.
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సభలో ఆర్టికల్ 370 కింద తీర్మానం పాస్ చేశారు. మూజువాణి ఓటు ద్వారా ఎంపీలపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తేశారు. తొలుత ఇవాళ కాంగ్రెస్ చీఫ్ విప్ కే సురేశ్.. ఎంపీలపై నిషేధాన్ని ఎత్తివేయాలని స్పీకర్‌ను కోరారు. ఎంపీ సురేశ్‌కు సమాజ్‌వాదీ పార్టీ నేత ధర్మేంద్ర ప్రధాన్ మద్దతు ఇచ్చారు. సస్పెన్షన్ రద్దు అయిన ఎంపీల్లో గుర్జీత సింగ్ ఔజ్లా, హిబ్బి ఈడెన్, సి కిరణ్ కుమార్ రెడ్డి, అమరిందర్ సింగ్ రాజా వారింగ్, మానికం ఠాగూర్, ప్రశాంత్ పడోల్, డీన్ కురియకోస్, ఎస్ వెంకటేశన్ ఉన్నారు.సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత ఆ 8 మంది ఎంపీలు ఇవాళ పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి నివాళి అర్పించారు.



