Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుపదవీ విరమణ రోజునే సస్పెండ్‌ వేటు..

పదవీ విరమణ రోజునే సస్పెండ్‌ వేటు..

- Advertisement -

నవతెలంగాణ – తమిళనాడు : అవినీతి ఆరోపణలతో పదవీ విరమణ రోజునే ఓ ప్రభుత్వ వైద్యురాలిపై సస్పెండ్‌ వేటు పడింది. ఈ ఘటన తమిళనాడులోని తెన్కాశి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో జరిగింది. శ్రీపద్మావతి రోగులకు ఆహారం అందించడానికి ఆకుకూర కొనుగోలులో ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదు వచ్చింది. ఆరోగ్యశాఖ అధికారుల విచారణలో.. రూ.25 విలువైన ఒక్కో ఆకుకూర కట్టను రూ.80 చొప్పున కొన్నట్లు చూపించారని నిర్ధారణ అయింది. తెన్కాశి ఆస్పత్రి నుంచి కొద్దినెలల క్రితం ఆమె తూత్తుకుడి ప్రభుత్వాస్పత్రికి పరిపాలనా అధికారిగా బదిలీ అయ్యారు. శనివారం ఆమె పదవీ విరమణ చేయాల్సి ఉంది. గతంలో పనిచేసిన ఆస్పత్రిలో ఆరోపణలేవీ తనపై లేవని ధ్రువీకరణపత్రం ఇవ్వాలని తూత్తుకుడి ఆస్పత్రి వైద్యాధికారులు ఆమెను కోరారు. కానీ పద్మావతి నకిలీ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించారు. తూత్తుకుడి వైద్యాధికారులు అనుమానంతో తెన్కాశి ఆస్పత్రిలో విచారణ జరపగా అది నకిలీదని నిర్థారణ అయ్యింది. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖకు సిఫార్సు చేశారు. శ్రీపద్మావతిని సస్పెండ్‌ చేస్తూ ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీచేసింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad