- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ నల్లకుంటలో దారుణం జరిగింది. వెంకటేశ్ అనే వ్యక్తి తన భార్య త్రివేణిపై అనుమానంతో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కుమారుడిని బయట నిలబెట్టి, నిద్రిస్తున్న భార్యపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో త్రివేణి సజీవ దహనం కాగా, కుమార్తె ప్రాణాలతో బయటపడింది. నిందితుడు పరారయ్యాడు, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



