Saturday, May 3, 2025
Homeరాష్ట్రీయంస్వచ్ఛ పల్లెలే లక్ష్యంగా స్వచ్ఛదనం యాప్‌

స్వచ్ఛ పల్లెలే లక్ష్యంగా స్వచ్ఛదనం యాప్‌

– గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి
– డంపింగ్‌ యార్డుల్లో చెత్త పేరుకుపోకుండా ప్రత్యేక చర్యలు
– ఎరువుల తయారీపైనా కేంద్రీకరణ
– పదిరోజుల్లో యాప్‌ అందుబాటులోకి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

స్వచ్ఛపల్లెలే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు యాప్‌ను తీసుకురాబోతున్నది. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై మరింత దృష్టి సారించాలనే మంత్రి సీతక్క ఆదేశాలతో పంచాయతీరాజ్‌, గ్రామీణా భివృద్ధి శాఖ యాప్‌ను తేవాలని నిర్ణయిం చింది. కొత్త యాప్‌ పదిరోజుల్లో అందుబాటులో తీసుకురానున్నది. ఎన్ని చర్యలు చేపట్టినా పంచాయతీల్లో చెత్త సేకరణ ప్రణాళి కాబద్ధంగా ఉండటం లేదనే దానిపై పంచా యతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నది. సేకరించిన చెత్తను ఏదో ఒక చోట డంప్‌ చేసి వదిలేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో చెత్త అక్కడ కుప్పగా పేరుకుపోతున్నది. తడి, పొడి చెత్త సేకరణ కూడా సరైన రీతిలో అమలు కావడం లేదని సర్కారు దృష్టికొచ్చింది. దీంతో ఆ గ్రామాల్లో ఇబ్బందులు వస్తున్నాయి. వ్యాధులకు కారణమ వుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆ శాఖ అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులు చెత్త సేకరణకు పీఎస్‌ యాప్‌ వాడుతున్నారు. దాన్ని మరింత అప్‌డేట్‌ చేసి చెత్తసేకరణ పర్యవేక్షణకు ప్రత్యేక యాప్‌ను రాష్ట్ర తీసుకురాబోతున్నది. ఇప్పుడున్న యాప్‌లో పంచాయతీల నిర్వహణపైనా, ప్రతి రోజూ కాలువలు, వీధులను, కార్యాలయాలను శుభ్రపరిచే సమాచారాన్ని ఫొటోల రూపంలో పంచాయతీ కార్యదర్శులు అప్‌లోడ్‌ చేస్తున్నారు. చెత్త సేకరణ తర్వాత వాటిని ఎరువులుగా మార్చడం, డంపిం గ్‌యార్డులో పేరుకుపోకుండా చూడటం వంటి విషయంలో పర్యవేక్షణా లోపం కనిపిస్తు న్నదని పంచాయతీరాజ్‌ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే పంచాయతీ సెక్రెటరీ మొబైల్‌ యాప్‌లో వేస్ట్‌ కలెక్షన్‌ మేనేజ్మెంట్‌ కోసం అదనంగా ఒక ఆప్షన్‌ను చేర్చారు. దానికి ”స్వచ్ఛదనం” అని పేరు పెట్టారు. ఆ ఆప్షన్‌ ద్వారా ప్రతి రోజు గ్రామం లో ఎన్ని నివాసాల నుంచి చెత్త సేకరిం చారు? ఎంత మేర చెత్త పోగయ్యింది? అందులో తడి, పొడి చెత్త ఎంత మోతాదులో ఉంది? దాన్ని వేరు చేస్తున్నారా? ఆ తర్వాత దాన్ని ఏం చేస్తున్నారు? అనేదానిపై కార్యదర్శులు యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. దీంతో సేకరించిన చెత్తను ఎక్కడో అక్కడ పడేయకుండా చూడాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తున్నది.

చెత్తను ఎరువుగా మార్చడంపై దృష్టి

గ్రామాల్లో ఒక్కో వ్యక్తి రోజుకు కనీసం 100 గ్రాముల చెత్తను పారేస్తున్నారనే అంచనాలున్నాయి. అంతమోతాదులో సిబ్బంది చెత్తను సేకరించాలి. ఆ దిశగా చెత్త సేకరణ లేనట్టయితే గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేనట్టుగా భావించాలని సర్కారు నిర్ణయించింది. అలాంటి సందర్భంలో పంచాయతీ కార్యదర్శిని అప్రమత్తం చేసి చేత్త సేకరణ ప్రక్రియను మెరుగు పరిచేలా చర్యలు తీసుకోనున్నది. యాప్‌ ద్వారా నిత్యం చెత్త సేకరణ ప్రక్రియను పర్యవేక్షించడం ద్వారా గ్రామాల్లో స్వచ్ఛదనాన్ని పెంచే చర్యలు చేపట్టనున్నది. డంపింగ్‌ యార్డులో ఏరోజుకారోజు తడిచెత్తను వేరు చేసి 60 రోజుల్లో ఎరువుగా మార్చే ప్రక్రియను పంచాయతీలు మొదలుపెట్టనున్నాయి. కేజీ పొడి చెత్త 60 రోజుల్లో 150 గ్రాముల ఎరువుగా మార్చాలని పంచాయతీరాజ్‌ శాఖ లక్ష్యంగా పెట్టింది. ప్లాస్టిక్‌, సీసాలు, తదితరాల పొడి చెత్తను ప్లాస్టిక్‌ డిస్పోస్‌ కేంద్రాలకు విధిగా తరలించాలి. అలా వీలు కాకపోతే ఎప్పటికప్పుడు వాటిని అమ్మేయాలి. ఎట్టి పరిస్థితుల్లో గ్రామాల్లో డంప్‌ చేయకూడదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img