Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలల చాటిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద

భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలల చాటిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద

- Advertisement -
  • – విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
    నవతెలంగాణ – వనపర్తి
  • భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలల చాటిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. వనపర్తి పట్టణంలోని వివేకానంద చౌరస్తాలో నిర్వహించిన వేడుకల్లో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. వనపర్తి పట్టణంలోని వివేకానంద చౌరస్తాలో నిర్వహించిన వేడుకల్లో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. స్వామి వివేకానంద విగ్రహానికి వివేకానంద జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వామి వివేకనంద విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వామి వివేకానంద జయంతిని యువజన దినోత్సవం గా జరుపుకుంటారని, యువకులు ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద జిల్లా కమిటీ సభ్యులు కోటేశ్వర్ రెడ్డి, భాను ప్రసాద్, పిచ్చయ్య, రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణ గౌడ్, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వాకిటి ఆదిత్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు చీరల చందర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ, వనపర్తి పట్టణ ప్రముఖ వైద్యులు పగిడాల శ్రీనివాస్, వనపర్తి పట్టణ మాజీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

నవతెలంగాణ కంఠేశ్వర్ 

నిజామాబాద్ జిల్లా, వర్ని మండలంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏ ఐ బి ఎస్ ఎస్ మండల అధ్యక్షుడు, కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బంజారా సంఘానికి చెందిన పెద్దలు,నాయకులు, యువకులు అందరూ కలిసి ఏకాభిప్రాయంతో పాల్త్య శ్రీనివాస్ ని మండల అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది.  ఈ గొప్ప అవకాశం తనకు కల్పించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తమ బంజారా సమాజ అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేసారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -