Monday, January 12, 2026
E-PAPER
Homeజిల్లాలుయువతకు స్వామి వివేకానంద స్ఫూర్తి

యువతకు స్వామి వివేకానంద స్ఫూర్తి

- Advertisement -

మర్రిగూడ టౌన్ సర్పంచ్ వీరమల్ల శిరీష లోకేష్ గౌడ్
నవతెలంగాణ-మర్రిగూడ:
యువతకు స్వామి వివేకానందే స్ఫూర్తితో యువత లక్ష్యాలను సాధించాలని మర్రిగూడ టౌన్ సర్పంచ్ వీరమల్ల శిరీష లోకేష్ గౌడ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా.. యూత్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో.. నిర్వహించిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రక్తదానం ఎంతో గొప్పదని, సరైన సమయంలో రక్తం దొరకక నిత్యం ఎంతోమంది మృతి చెందుతున్నారని, రక్తదానంపై అపోహలు వీడి యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని సూచించారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారిని అభినందించారు.అంతకుముందు మండల కేంద్రంలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి సర్పంచ్ తో పాటు పలువురు పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో టౌన్ మాజీ సర్పంచ్ నల్ల యాదయ్య గౌడ్,పందుల రాములు గౌడ్,చెరుకు శ్రీరామ్ గౌడ్,యూత్ ఫర్ బెటర్ సొసైటీ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -