- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి ఇన్నర్ విల్ క్లబ్ వారి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం స్థానిక ఎస్ ఎల్ ఎన్ ఎస్ కళాశాల ఎదురుగా ఉన్న వివేరా హాల్లో నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో డిస్ట్రిక్ట్ చైర్మన్ కే స్వర్ణలత ప్రమాణస్వీకారాన్ని నిర్వహించారు. అధ్యక్షులుగా ఈ లావణ్య, కార్యదర్శిగా వెంకమ్మ, కోశాధికారిగా భాగ్య, ఐఎస్ఓ గా సుభాషిని ఎడిటర్ గా ఉమామ ఉమాదేవి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వికలాంగులకు సైకిల్ బహుకరించారు. ఆశావాకర్లకు చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ క్లబ్ సభ్యులు డాక్టర్ జయశ్రీ, బండారు జయశ్రీ, జ్యోతి, సునీత, సుమిత్ర, రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొన్నారు
- Advertisement -