Friday, February 27, 2026
E-PAPER
Homeకరీంనగర్అడవి శ్రీరాంపూర్ గ్రామంలో 5 రోజులుగా నిలిచిన టీ-ఫైబర్ సేవలు.

అడవి శ్రీరాంపూర్ గ్రామంలో 5 రోజులుగా నిలిచిన టీ-ఫైబర్ సేవలు.

- Advertisement -

– ఇబ్బందుల్లో గ్రామస్తులు,విద్యార్థులు
నవతెలంగాణ-ముత్తారం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన టీ-ఫైబర్ సేవలు గత 5 రోజులుగా నిలిచిపోవడంతో అడవి శ్రీరాంపూర్ గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కేబుల్ టీవీ మరియు హై-స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాలను ఉచితంగా అందిస్తామని ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టినప్పటికీ,క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యల కారణంగా సేవలు నిరంతరం అంతరాయం కలుగుతున్నాయి.ఈ కారణంతో విద్యార్థుల చదువులకు,ఆన్‌లైన్ క్లాసులు మరియు విద్యాసంబంధిత వివరాల కోసం ఇంటర్నెట్‌పై ఆధారపడిన విద్యార్థులు వారం రోజులుగా ఇబ్బంది పడుతున్నారు.రోజంతా పనిలో నిమగ్నమై సాయంత్రం సమయంలో కాసేపు కాలక్షేపం కోసం టీవీల ముందు కూర్చునే వారికి ఇంటర్నెట్‌తో పాటు కేబుల్ సేవలు కూడా రావడం లేదని వాపోతున్నారు. సమస్య తలెత్తి ఇన్ని రోజులు గడుస్తున్నా సంబంధిత అధికారులు గానీ,టెక్నీషియన్లు గానీ పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.డిజిటల్ తెలంగాణలో భాగంగా ప్రతి ఇంటికీ నెట్ చేరాలన్న లక్ష్యం, ఇలాంటి నిర్లక్ష్యం వల్ల దెబ్బతింటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి,టీ-ఫైబర్ లైన్లను పునరుద్ధరించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -