Monday, February 16, 2026
E-PAPER
HomeఆటలుT20 WORLD CUP: ఎట్ట‌కేల‌కు గెలిచిన ఆప్ఘానిస్థాన్

T20 WORLD CUP: ఎట్ట‌కేల‌కు గెలిచిన ఆప్ఘానిస్థాన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఎట్ట‌కేల‌కు ఆప్ఘానిస్థాన్ టీం విజ‌యం సాధించింది. యూఏఈపై 5 వికెట్ల తేడాతో టోర్నీలోనే తొలి విక్ట‌రీ న‌మోదు చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ 9 వికెట్లు కోల్పోయి 160 ప‌రుగులు చేసింది. సోయాబ్ ఖాన్(68) అర్ధ సెంచ‌రీ కొట్టాగా..షార‌ప్ 40 ర‌న్స్‌తో రాణించారు. ఆప్ఘాన్ బౌల‌ర్లు అజ్మ‌తులా ఓమ‌రాజ్ నాలుగు వికెట్లు తీయ‌గా ర‌షీద్ ఖాన్ ఒక వికెట్ తీశాడు. చేధ‌న‌కు దిగిన ఆప్ఘాన్ టీం..5 వికెట్ల తేడాతో విక్ట‌రీ సాధించింది. ఇబ్ర‌హీం జోర్దాన్ (53) అర్థ సెంచ‌రీతో విజ‌యానికి బాట‌లు వేశాడు. అజ్మ‌ల్ (40), ర‌సూల్ (33) అమూల్య‌మైన ఆటతో ఇరువురు జ‌ట్టుకు మెగా టోర్నీలో తొలి విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టారు. యూఏఈ బౌల‌ర్లు జునాబీ సిద్ద‌ఖీ, మ‌హ్మ‌ద్ త‌లా రెండు వికెట్లు తీయ‌గా జాహ‌ద్ దుల్లా ఒక వికెట్ తీశాడు.

అయితే ద‌.ఆఫ్రికాతో జ‌రిగిన రెండో సూప‌ర్ ఓవ‌ర్ మ్యాచ్‌లో ర‌షిద్‌ సేన ఓడిపోయిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో సౌతాఫ్రికా అగ్ర‌స్థానంలో ఉండ‌గా, న్యూజిలాండ్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నంది. గ్రూప్ డీలో టాప్ టూ జ‌ట్లు సూప‌ర్-8 వెళ్ల‌నున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -