నవతెలంగాణ-హైదరాబాద్: మెగా టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ముంబాయిలోని వాంఖడే స్టేడియంలో యూఎస్ఏ(అమెరికా), టీమిండియా మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈక్రమంలో టాస్ గెలిచిన యూఎస్ఏ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన ఇండియాకు నిరాశ ఎదురైంది. అభిషేక్ శర్మ డకౌట్ గా వెనుదిరిగాడు. ఆలీ ఖాన్ వేసిన ఓవర్లో అభిషేక్ శర్మ ఔట్ అయ్యాడు. అతను ఎదురుకున్న మొదటి బంతికే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత 20 పరుగుల వద్ద ఇషాన్ కిషన్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. స్వల్ప రన్స్ చేసి తిలక్ వర్మ కూడా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన శివం దూబే, డకౌట్ అయ్యాడు. రింకు సింగ్(06), హర్ధిక్ పాండ్య(5), అక్షర్ పటేల్(14) నిరాశపరిచారు. ప్రస్తుతం క్రీజులో సూర్యకుమార్(50), అర్షదీప్(4) ఉన్నారు. 17 ఓవర్లు ముగిసేరికి ఇండియా స్కోర్: 128-7
ఈసారి టీ20 క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీకి శ్రీలంక-భారత్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. తొలి మ్యాచ్ పాకిస్థాన్, నెదర్లాండ్ మధ్య జరగ్గా..మూడు వికెట్లతో తేడాతో పాక్ తొలి విజయం నమోదు చేసింది. 20 ఓవర్లకు నెదర్లాండ్ 147 కొట్టగా, 7 వికెట్లు నష్టపోయి పాక్ ఆటగాళ్లు టార్గట్ చేధించారు. అదే విధంగా టోర్నిలో రెండో మ్యాచ్ కలకత్తా వేదికగా వెస్టిండిస్, స్కాట్లాండ్ మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ 185-5 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రస్తుతం లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్ 10 వికెట్లు కోల్పోయి 147 రన్స్ చేసి ఓడిపోయింది.



