Saturday, February 7, 2026
E-PAPER
HomeఆటలుT20 WORLD CUP: ఇండియా స్కోర్‌:161-9

T20 WORLD CUP: ఇండియా స్కోర్‌:161-9

- Advertisement -

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ తొలి మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ అట్ట‌ర్ ప్లాప్ అయింది. అభిషేక్ శ‌ర్మ‌, శివం దూబే డ‌కౌట్ అయ్యారు. భీక‌ర్ ఫామ్‌లో ఉన్న ఇండియాన్ బ్యాట‌ర్లు యూఎస్‌ఏ బౌల‌ర్లు ముందు నిలువ‌లేక‌పోయారు. కెప్ట‌న్ ఇన్సింగ్స్ తో సూర్య‌కుమార్ ఒక్క‌డే వీరోచిత‌పోరాటం చేశాడు. 49 బంతుల్లో 83 ప‌రుగులు(10 ఫోర్లు,4 సిక్స్) చేసి హోరా అనిపించాడు. మొత్తం 20 ఓవ‌ర్ల‌కు గాను 9వికెట్లు కోల్పోయి 161 ప‌రుగుల ల‌క్ష్యాన్ని యూఎస్‌ఏ ముందుంచింది టీమిండియా.

తొలుత‌ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న యూఎస్ఏ..ఇండియా టీంను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. క్రీజులోకి వ‌చ్చిన ఓపెన‌ర్లు ఇషాన్ కిష‌న్, అభిషేక్ శ‌ర్మ యూఎస్‌ఏ బౌల‌ర్ల‌ను ఎదురుకోలేక‌పోయారు. తొలి బంతి నుంచి యూఎస్‌ఏ బౌల‌ర్లు బాణాలాంటి బంతులు సంధించారు. ఆలీ ఖాన్ వేసిన బౌలింగ్‌లో అభిషేక్ శ‌ర్మ ప‌రుగుల‌ ఖాతా తెర‌వ‌కుండానే డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. ఆ త‌ర్వాత ఇషాన్ బౌండ‌ర్లీతో బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి ప్ర‌య‌త్నించినా..ఫ‌లితం లేక‌పోయింది. ములింద్ కుమార్ వేసిన ఐదో ఓవ‌ర్లో ముగ్గురు హిట్ట‌ర్ బ్యాట‌ర్లు స్వ‌ల్ప ప‌రుగుల‌కే ఇషాన్ కిష‌న్(20), తిల‌క్ వ‌ర్మ‌(25), శివం దూబే(0) ఔట్ అయ్యారు.

ఐదు ఓవ‌ర్లు ముగిసేరికి ఇండియా స్కోర్ 45-4తో పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ఆదుకుంటాడు అనుకున్న రింగ్ సింగ్ కూడా 14 బంతులు ఎదుర్కొని 6 ప‌రుగులు చేసి పెవిలియ‌న్ బాట‌ప‌ట్టాడు. ఆ త‌ర్వాత ఓవ‌ర్లో క్రీజులోకి వ‌చ్చిన‌ హ‌ర్థిక్ పాండ్యా(6) కూడా తీవ్ర నిరాశ ప‌రిచాడు. నాల్గో స్థానంలో వ‌చ్చిన కెప్ట‌న్ సూర్య‌(83) స‌ముచిత‌మైన ఆట‌తో స్కోర్ బోర్డును అర్ధ‌ సెంచ‌రీతో ముందుకు న‌డిపించాడు. ఓ ఎండ్‌లో వికెట్లు ప‌డుతున్నా..బౌండ‌ర్లీల‌తో యూఎస్‌ఏ బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు. ఈక్ర‌మంలోనే అక్ష‌ర్ ప‌టేల్(14), అర్షీదీప్(4)ల‌తో క‌లిసి ఇన్సింగ్స్ న‌డిపించాడు. చివ‌రి వ‌ర‌కు క్రీజులో ఉండి ఇండియాకు గౌర‌వ‌ప‌ద‌మైన స్కోర్(161)ను అందించాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -