Saturday, February 7, 2026
E-PAPER
Homeఆటలుటీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌: నెద‌ర్లాండ్‌పై పాక్ గెలుపు

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌: నెద‌ర్లాండ్‌పై పాక్ గెలుపు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: నేటి నుంచి ప్రారంభ‌మైన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పాకిస్థాన్ తొలి విజ‌యం న‌మోదు చేసింది. నెద‌ర్లాండ్ పై మూడు వికెట్ల తేడాతో విక్ట‌రీ సాధించింది. శ్రీ‌లంక వేదిక‌గా నెద‌ర్లాండ్‌, పాకిస్థాన్ జ‌ట్లు మెగా టోర్న‌మెంట్ లో మొద‌టి మ్యాచ్ ఆడాయి. తొలుత‌ బ్యాటింగ్ చేసిన నెద‌ర్లాండ్ 20 ఓవ‌ర్ల‌కు గాను 10 వికెట్లు కోల్పోయి 147 ప‌రుగులు చేసింది. ఎడ్వార్స్ 37, లీడే 30, లీవేట్ 24, ఆక్రామ‌న‌న్ 20 ర‌న్స్ రాణించారు. పాక్ బౌల‌ర్లు స‌ల్మాన్ మీర్జా 3, న‌వాజ్, అక్బ‌ర్, ఆయూబ్ 2 వికెట్లు తీయ‌గా, షా ఆఫ్రిదీ ఒక వికెట్ తీశాడు.

ఆ త‌ర్వాత ల‌క్ష్య ఛేద‌న‌కు దిగిన పాకిస్థాన్ త‌డ‌బ‌డింది. ఓపెన‌ర్లు ఫారాన్ 47, ఆయూబ్ 24 మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చించారు. వీరి ఔట్ తో క్రీజులోకి వ‌చ్చిన‌ షాబుజ్ ఫారాహ‌న్, ఉస్మాన్ ఖాన్ ఒకే ఓవ‌ర్లో ఔట్ కాగా,ఆ త‌ర్వాత బాబార్ అక్బ‌ర్ మ‌రుస‌టి ఓవ‌ర్లో పెవిలియ‌న్ చేరాడు. దీంతో ఒక్క‌సారిగా పాక్ క‌ష్టాల్లో ప‌డింది. మిగిలిన బ్యాట్స్ మెన్లు త‌లా పిడికెడు ప‌రుగులు చేస్తూ పాక్ టీంకు విజ‌యాన్ని అందించారు. చివ‌ర‌లో ఫ‌హిల్ ఆష్ర‌ప్ మెరుపుల‌తో అంతిమంగా 7 వికెట్లు కోల్పోయి టార్గ‌ట్‌ను బీట్ చేసింది. నెద‌ర్లాండ్ బౌల‌ర్లు మీక్రాన్, డ‌ట్ రెండు వికెట్లు, బీక్, కేల్లీన్, మార్వే త‌లో వికెట్లు తీశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -