Saturday, February 21, 2026
E-PAPER
HomeఆటలుT20 WORLD CUP: సూప‌ర్-8 తొలి ఆట‌కు వ‌ర్షం ఆటంకం

T20 WORLD CUP: సూప‌ర్-8 తొలి ఆట‌కు వ‌ర్షం ఆటంకం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: నేటి నుంచి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ప్రారంభ‌మైన సూప‌ర్-8 మ్యాచ్‌కు వ‌రుణుడు ఆటంకం క‌లిగించాడు. కొలంబో వేదిక‌గా పాక్-న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య వ‌ర్షం కార‌ణంగా తాత్కాలికంగా మ్యాచ్ వాయిదా ప‌డింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ గెలిచిన పాక్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, ఈ ఏడాది టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ మెగా టోర్నీకి భార‌త్-శ్రీ‌లంక ఆతిథ్యమిస్తున్నాయి. తొలిసారి 20 జట్లు పోటీపడుతుండగా.. టైటిల్‌ వేటలో ఎనిమిది జట్లే మిగిలాయి. సూపర్‌8లో గ్రూప్‌-1లో ఆతిథ్య భారత్‌ సహా దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, జింబాబ్వే ఉన్నాయి. గ్రూప్‌ దశలో ఈ నాలుగు జట్లు అజేయం గా నిలువటం విశేషం. గ్రూప్‌-ఏలో భారత్‌, గ్రూప్‌-బిలో జింబాబ్వే, గ్రూప్‌-సిలో వెస్టిండీస్‌, గ్రూప్‌-డిలో దక్షిణాఫ్రికాలు ఓటమి చవిచూడలేదు. దీంతో సూపర్‌8లో ఈ గ్రూప్‌లో పోటీ తీవ్రంగా ఉండనుంది. ఆస్ట్రేలియాను కంగుతి నిపించి సూపర్‌8కు చేరుకున్న జింబాబ్వేను తేలిగ్గా తీసుకునేందుకు ఇతర జట్లు ఏమాత్రం సిద్ధంగా లేవు. డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుండగా.. వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికాలు గట్టి సవాల్‌ విసిరేందుకు ఎదురు చూస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -