నవతెలంగాణ-హైదరాబాద్: టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో భాగంగా రెండో సెమీ పోరులో… గురువారం ముంబాయి వాంఖడే స్టేడియంలో సంజు సామ్సన్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఇంగ్లాండ్‌పై భారత్ చిరస్మరణీయ విజయం సాధించిన విషయం తెలిసిందే. 43 బంతుల్లో 89 పరుగలు చేసి ఆమూల్యమైన ఇన్నింగ్స్ ఆడాడు సంజు. ఈ మెగాలో టోర్నీలో సంజు సామ్సన్ 4 మ్యాచ్‌లు, 232 పరుగులు, 77.33 సగటు, 201.73 స్ట్రైక్ రేట్ ఉన్నాడు. వెస్టిండీస్‌పై సూపర్ 8 విజయంలో అతను 50 బంతుల్లో అజేయంగా 97* పరుగులు చేశాడు, ఆ తర్వాత నాకౌట్ సెమీఫైనల్లో 42 బంతుల్లో వేగంగా 89 పరుగులు చేసి, మరోసారి భారతదేశం తరఫున ఆధిక్యాన్ని సాధించాడు.
ఈక్రమంలో T20 వరల్డ్ కప్-2026లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుకు సంజు సామ్సన్ నామినేట్ చేయబడ్డాడు. మెగా టోర్నీలో ఉత్తమంగా రాణించిన ప్లేయర్ల షాట్ లిస్ట్‌ను ఐసీసీ వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఈ జాబితాలో ఇండియా తరుపున ఓపెనర్ సంజు పేరు మాత్రమే ఉంది. మిగిలిన ఏడుగురులో షాడ్లీ వాన్ షాల్క్విక్ (USA), రచిన్ రవీంద్ర, మార్క్‌రమ్,నింగిడి (దక్షిణాఫ్రికా), సాహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్తాన్), విల్ జాక్స్ (ఇంగ్లాండ్) తదితర ఆటగాళ్ల పేర్లు ఉన్నాయి.



